బాల్యమంతా చదువు బాధ్యతలు
యువ్వనంలొ ఉద్యోగ ప్రయత్నాలు
ఆమ్మ నాన్న ఆశిర్వాదంతో ఒక ఉద్యోగం
పెద్దల దీవెనెల తో పెళ్ళి కొడుకు అవతారం
ఒక చేతిలొ గాండీవం, మరొ చేతిలొ రథ సారథ్యం
జీవిత మహాభారతం లొ రంగ ప్రవేశం
సిటీ చివర ఒక సింగల్ బెడ్రూం ఫ్లాట్
ఆందులొ గగణానికి అందుకునే కలలు
మొదటి సారిగ "ఆమెరికా పయనం" వ్యూహ రచనలు
ఎర్పోర్టలొ సాగ నంపులు, అత్త మామల హగ్గులు బొకేలు
కన్న వారి కన్నీలు, తొబుట్టువుల పొగడ్తలు
సతిమని కౌగిలి, సూట్ భుజం పై వాలిన మల్లె పూలు
రోజు కాల్ చెయ్యాలి అంటు వాగ్దానాలు, ఫ్లైట్ అటెండెంట్ అనౌస్మెంటులు
ఫ్లైట్ కిటికి లొ నుంచి అన్ని అరణ్యాలు ఎడారులు
నీలొ పొంగి పొతున్న అశలు అశయాలు
పొర్ట్ అఫ్ ఎంట్రి స్తాంపులు, గుండెళ్ళో దడ దడలు
ఆడిఒ ఇంటెర్యూలు, ఫేసె-టు-ఫేసె ఫేలురులు
తిరిగి రెఫెరెన్స్ సుబ్మిషన్లు, చివరిగా ఆఫర్ లెటర్ హైఫెయ్లు
నీ భార్యకు మద్రాస్ వీసా ముహుర్తం, అత్త మామలకు అంతులేని ఆనందం
చిలుకూరి వీసా వేంకటేశ్వర ప్రదక్షణం, అల్లుడికి పుల్లా రెడ్డి స్వీట్ దక్షిణం
రోజు ఇంటావిడకు ఆఫిస్ పాలిటిక్స్ రీరన్ కాలక్షేపం
ముక్కు మొహం తెలియని బాసుల పేరులు ఆవిడకు కంఠస్తం
అమెరికా ప్రయాణంలొ ఒక కొత్త మలుపు, "నెను తండ్రిని కాబోతున్నాను" కాస్సెపు విరామం
డాక్టర్ల చుట్టు ప్రదక్షణం, అత్త మామలు ఇంట్లొ అకస్మాతుగా ప్రత్యక్షం
క్లబ్ హౌసులొ క్రెడల్ సెరిమొని, తర్వాత చికాగొ నయాగరాల జర్ని
బావ మరిదికి ఒక ఇపాడ్, మరదలుకు ఒక ఇ20
భార్యకు ఇటి టెస్టింగ్ ట్రేనింగ్, అదే కంపని లొ ఎంట్రి లెవెల్ ఉద్యోగం
ఆఫిస్ ఒక్కటైన, దారులు వెరు వెరు
మొగుడు ఎదురొస్తె భార్య మొదటి సారి తలదింపుడు
అమెరికాలొ ఇంక ఎన్నొ విజయాలు వీరస్వర్గాలు
ఇల్లు, స్టాక్స్, గ్రీన్ కార్డు, కుమాన్లు, అలోహాలు
మెల్లగ ఒక్కరొక్కరిగా స్నేహితులకు "అల్ విదా"లు
ఇక మిగిలినవి పిల్లల చదువులు పాఠాలు
ఎలా మొదలైనా, ఇది న్ అర్ ఇ జీవిత సారాంశం
- వేంకట్ ఏక్క